వాళ్ళు కన్నెర్రజేస్తే జగన్ కి కష్టాలు తప్పేలాలేవే ?

Will Jagan go to jail in money laundering case?

ఆంధ్ర ప్రదేశ్: ఈడీ కోర్టు జగన్,విజయసాయిరెడ్డిలను స్వయంగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడంతో కథ కంచెకి చేరే రోజు దగ్గర్లో ఉందని ప్రత్యర్థులు జోతిష్యం చెప్పటం స్టార్ట్ చేశారు. జగన్ ఎంపీ కాక ముందు తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు అన్న దాని మీద ఈడీ కోర్టులో విచారణ చేస్తోంది. ఆర్ధిక నేరాల కేసులో జగన్ మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఈడీ సేకరించిందని చెబుతున్నారు. మనీ లాండరింగ్ కేసుల్లో జగన్ తప్పకుండా బుక్ అయి తీరుతారు అని కూడా అంటున్నారు.

Will Jagan go to jail in money laundering case?
Will Jagan go to jail in money laundering case?

సీబీఐ కేసులు జగన్ కి పెద్దగా సమస్య కాకున్నా ఈడీ కేసులు మాత్రం చాలా తీవ్రంగానే జగన్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కూడా ఈ రంగాన నిపుణత సాధించిన వారు అనే మాట. ఇక ఈ విషయం మీద గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పిన మాట ఒకటి ఉంది. ఈడీ కేసులే జగన్ కి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని అప్పట్లో ఉండవల్లి కూడా చెప్పారు. ఆయన స్వతహాగా న్యాయవాది కూడా. జగన్ మీద కేసులు ఇలా విరుచుకుపడితే రక్షించేది ఎవరు, అసలు ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అన్నది కూడా హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. జగనే అన్నింటికీ మూల బిందువు. ఆయనే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా. అలాంటిది జగన్ కనుక ఈడీ కేసుల్లో ఇరుక్కుంటే సర్కార్ భవిష్యత్తు ఏంటి అని వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని సమాచారం.