ఏపీ దేవాదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. మంచి వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఏపీకి చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. https://aptemples.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మొత్తం 70 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 5, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. బీఈ, బీటెక్ సివిల్, ఎలక్ట్రికల్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్.సీ.ఈ డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులు కాగా ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ సివిల్, ఎలక్ట్రికల్ పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్ సైట్ లో దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి సర్టిఫికెట్ల జిరాక్స్ లను ది కన్వీనర్, రిక్రూట్మెంట్ సర్వీస్, పవర్ అండ్ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం జనవరి 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లలో ఏఈఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల వేతనం లభించనుండగా టీఏకు 25 వేల రూపాయలతో పాటు అదనపు అలవెన్స్ లను పొందే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.