యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 300 ఉద్యోగ ఖాళీలు.. అర్హులు ఎవరంటే?

చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాలలో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలలో అసిస్టెంట్ పోస్టులు 300 ఉండగా అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్‌లో 8 ఖాళీలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఖాళీలు ఉన్నాయి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం డిసెంబర్ 30 నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.62,265 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ పరీక్షతో పాటు రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది. 2024 సంవత్సరం జనవరి 6వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మొత్తం వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ సైతం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.