ఏపీలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం ఐసీడీఎస్ పరిధిలో 7 అంగన్ వాడీ కార్యకర్తలు, 19 సహాయకులు, 8 మినీ అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం డివిజన్ లోని కొమరాడ ప్రాజెక్ట్ పరిధిలో ఒక అంగన్ వాడీ కార్యకర్త, ఐదుగురు సహాయకులు, ఒక మినీ అంగన్ వాడీ పోస్ట్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
పార్వతీపురం ప్రాజెక్ట్ పరిధిలో ఒక అంగన్ వాడీ కార్యకర్త, ఇద్దరు అంగన్ వాడీ సహాయకులు, ఒక మినీ అంగన్ వాడీ జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. పాచిపెంట ప్రాజెక్ట్ పరిధిలో మూడు అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగ ఖాళీలతో పాటు ఆరు అంగన్ వాడీ సహాయకులు, నాలుగు మినీ అంగన్ వాడీ సహాయకుల ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. సాలూరు ప్రాజెక్ట్ పరిధిలో ఒక అంగన్ వాడీ సహాయకురాలు, ఒక మినీ అంగన్ వాడీ పోస్ట్ ఖాళీగా ఉంది.
పాలకొండ డివిజన్ లో ఉన్న కురుపాం ప్రాజెక్ట్ పరిధిలో 2 అంగన్ వాడీ కార్యకర్తలు, నాలుగు అంగన్ వాడీ హెల్పర్ పోస్ట్ లు, ఒక మినీ అంగన్ వాడీ పోస్ట్ ను భర్తీ చేయనున్నారు. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు అనుగుణంగా వేతనం లభిస్తుంది.
అర్హత ఉన్నవాళ్లు ఈ నెల 14వ తేదీలోగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.