చంద్రబాబుకు దిష్టి తీసిన భార్య భువనేశ్వరి ‘(వీడియో)

 ఈ రోజు చిత్తూరు ,శ్రీకాకుళం జిల్లాలలో ఎన్నికల  పర్యటనకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భార్య భువనేశ్వరి దిష్టి తీశారు. 

ఆయన కొద్ది సేపటి కిందట  ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ లో కుమారుడు మంత్రి లోకేష్, భార్య భువనేశ్వరి లతో కలసి  విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరారు.భయలు దేరే ముందు ఆమె టెంకాయ కొట్టి ఆయనకు దిష్టి తీశారు.  విజయవాాడ  విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లి   అక్కడి నుంచి  తిరుమలకు వెళ్లి  శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఎన్నికల కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం తిరుపతి తారక రామ స్టేడియం లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి నుండి ప్రత్యేక విమానం లో విశాఖపట్నం వెళ్తారు.  అక్కడనుండి హెలికాపీటర్లో శ్రీకాకుళం చేరుకుని కోడి రామ మూర్తి స్టేడియం లో బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.