Naresh: సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగుతున్న వారిలో సీనియర్ నటుడు నరేష్ ఒకరు. ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే కెరియర్ మొదట్లో నరేష్ పలు సినిమాలలో కామెడీ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నరేష్ ప్రస్తుతం ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అప్పట్లో కామెడీ హీరోలు అంటే నేను రాజేంద్రప్రసాద్ మాత్రమేనని తెలిపారు. మేమిద్దరమే అలాంటి సినిమాలలో నటించే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మా ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని తెలిపారు ఇక ఇద్దరిలో ఎవరు గొప్ప నటులు అంటే చెప్పడం చాలా కష్టమని నరేష్ తెలిపారు.
ఎన్నో అద్భుతమైన పాత్రలలో రాజేంద్రప్రసాద్ నటించారు అలాంటి పాత్రలలో నేను చేయలేను కానీ నేను చేసిన పాత్రలను కూడా రాజేంద్రప్రసాద్ చేయలేరు అంటూ వీరిద్దరి సినిమాల గురించి వీరి నటన గురించి నరేష్ తెలిపారు. ఇకపోతే నా దృష్టిలో మాత్రం రాజేంద్రప్రసాద్ కంటే కూడా నేనే గొప్ప నటుడిని అని ఫీల్ అవుతాను అంటూ తెలిపారు. అలా ఫీల్ అవ్వకపోతే మనం ముందుకు వెళ్లలేము నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇతరులు ప్రేమించలేరు అంటూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఈయన రాజేంద్రప్రసాద్ కంటే తానే గొప్పగా నటిస్తానని ఏ ఉద్దేశంతో చెప్పినా ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారి నటనకు మీరు ఏ మాత్రం సాటిరారని ఆయన నటన మరో లెవెల్ లో ఉంటుందని కొంతమంది రాజేంద్రప్రసాద్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ నరేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.