Vijay Sai Reddy: జగన్ తో విభేదాలపై నోరు విప్పిన విజయ్ సాయి రెడ్డి… కోటరీనే కారణమా?

Vijay Sai Reddy: వైయస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్నటువంటి ఈయన పార్టీ వ్యవహారాలన్నింటిని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దే వారు జగన్ తర్వాత అంతటి నాయకుడిగా విజయసాయిరెడ్డి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అయితే తాను రాజకీయాలకే దూరంగా ఉంటున్నానని ఇతర ఏ పార్టీలలోకి చేరను అంటూ రాజకీయాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉన్నఫలంగా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి బయటకు రావడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి బహుశా ఈయన ఇతర పార్టీలోకి చేరబోతున్నారని అందరూ భావించారు.

ఈ విధంగా విజయసాయిరెడ్డి రాజకీయాల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన తాజాగా జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే బయటకు వచ్చాను అంటూ షాకింగ్ విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయ బేధాలను సృష్టించారని తెలిపారు.

ఈ విషయంలో తాను దిగుతున్న మెట్ల పైకి వాళ్ళు ఎక్కుతున్నారు. ఇందులో ఎంతోమంది సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు.తాను చిత్తశుద్ధితో వైసీపీలో పనిచేశానని.. జగన్ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ చుట్టూ ఉన్న కొటరీ నుంచి బయట పడిన రోజే ఆయనకు భవిష్యత్ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు ప్రజలు కూడా మోసపోతారు జగన్ ఎప్పుడైతే ఆ కోటరీ నుంచి బయటపడతారో అప్పుడే సక్సెస్ అవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు.

జగన్ మనసులో స్థానం లేదని వైసీపీని వీడుతున్నట్లు నేరుగా ఆయనకే చెప్పానన్నారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నారు. ఒకప్పుడు నాయకుడిపై భక్తి, ప్రేమ ఉందన్నారు. కానీ ఇప్పుడు దేవుడిపై మాత్రమే ఉందన్నారు. తాను పడిన అవమానాలు, కష్టాలు వైసీపీలో ఇంకెవ్వరూ పడలేదని గుర్తు చేసుకున్నారు. తాను మారిపోయానని విశ్వసనీయతను కోల్పోయానని మాట్లాడారు కానీ తాను మారలేదని నాయకుడే మారిపోయాడని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక భవిష్యత్తులో తాను తిరిగి వైసీపీ పార్టీలోకి చేరేది లేదు అంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.