SSMB 29: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటికి ఈ సినిమా రహస్యంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలు బయటకు తెలుస్తూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం ఒరిస్సాలో షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ను రామాయణంలో ఒక ఘటం ఆధారంగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
రామాయణంలో లక్ష్మణుడు కళ్ళు తిరిగి పడిపోతే తనని బ్రతికించడం కోసం హనుమంతుడు సంజీవని కోసం పయనం అవుతూ సంజీవని మొక్కని తీసుకురావటం కోసం ఓ పర్వతాన్ని తీసుకువస్తాడు. ఇలా సంజీవని కోసం హనుమంతుడు వెళ్ళిన కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా రామాయణం ఆధారంగా ఈ సినిమా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు మహేష్ బాబుతో ఏం చేస్తున్నావు జక్కన్న అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే తప్పనిసరిగా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈ విషయాలన్నింటిని వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్న సంగతి తెలిసిందే.