జగన్ వల్లే  ‘ఆ ముగ్గురు’ విడిపోయారా ?

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్లే  నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జోడి విడిపోయిందని వైసిపి చెబుతోంది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర మొదలైన తర్వాతే పై ముగ్గురు బండారం బయటపడిందన్నారు. కేవలం అధికారం కోసమే పోయిన ఎన్నికల్లో ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారన్న విషయం జనాలు గ్రహించినట్లు చెప్పారు. పాదయాత్ర సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఆ ముగ్గురి నైజాన్ని వారి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఊరూరా తిరిగి జగన్ చెబుతుంటే ప్రజలంతా అదే విషయాలను చర్చించుకుంటున్నారట.

 

జగన్ పాదయాత్ర మొదలయ్యే వరకూ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు, పవన్ ఏనాడు పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై చంద్రబాబు, పవన్ కేంద్రాన్ని ఏనాడు నిలదీసింది లేదన్నారు. ప్రత్యేకహోదా పై చంద్రబాబు, పవన్ నాటకాలను జగన్ ప్రజలకు వివరించి చెప్పిన తర్వాతే జనాల్లో కూడా కదలిక వచ్చిందన్నారు. తమ బండారంపై  జనాల్లో చర్చలు మొదలైన తర్వాతే లాభం లేదని వచ్చే ఎన్నికల్లో కలిసుంటే జనాలను మళ్ళీ మోసం చేయటం కష్టమని మోడి, చంద్రబాబు, పవన్ విడిపోయినట్లు నాటకాలాడుతున్నట్లు మండిపడ్డారు.

 

పై ముగ్గురూ నిజంగానే విడిపోయారా లేకపోతే విడిపోయినట్లు నటిస్తున్నారా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. హోదా కోసం ఎప్పుడైతే జగన్ పట్టుబట్టారో అప్పుడే పవన్ కల్యాణ్ కూడా హోదా రాగం అందుకున్నారట. అంతకుముందు హోదా విషయంలో చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా జగన్ డిమాండ్  తర్వాతే హోదా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి పై ముగ్గురు నాటకాలను గమనిస్తున్న జనాలను వచ్చే ఎన్నికల్లో మోసం చేయటం కష్టమన్నారు. పోయిన ఎన్నికల్లో మోసపోయినట్లు వచ్చే ఎన్నికల్లో మోసపోమని జనాలు స్పష్టంగా చెబుతున్నట్లు వాసిరెడ్డి చెప్పారు. జగన్ చేతోల చెయ్యేసి వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని వైసిపికే అప్పగిస్తామని జగన్ చేతిలో చెయ్యేసి మరీ హామీలిస్తున్నట్లు వాసిరెడ్డ పద్మ గట్టిగా చెబుతున్నారు.