బంజారాహిల్స్ లో ఉద్రిక్తత… హీరో రెస్టారెంట్ కూల్చివేతకు అధికారుల యత్నం

బంజారాహిల్స్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను కూల్చేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే అది సినీ హీరో తారకరత్నకు చెందినది.

రెస్టారెంట్ నిర్వాహకులు, జీహెచ్ ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించారు. తమకు ఫిర్యాదు అందిందని నివాస ప్రాంతాలలో ఉండడం కరెక్టు కాదని వారు అన్నరు. హోటల్ నిర్వాహకులు వెంటనే తారకరత్నకు సమాచారమిచ్చారు. తారకరత్న వెంటనే అక్కడికి చేరుకొని అధికారులతో  మాట్లాడారు. సామాగ్రి తరలించేందుకు మూడు గంటల సమయం కావాలని కోరడంతో అధికారులు సమయమిచ్చారు.

డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిబంధనలకు విరుద్దంగా నివాస ప్రాంతాలలో నడుపుతున్నారని, రాత్రి వేళలో మందు తాగుతూ డీజే సౌండ్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీ సొసైటి సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదుతో అధికారులు హోటల్ ను కూల్చేందుకు వచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంతా సామరస్యంగా మాట్లాడుకోవడంతో సమస్య పరిష్కారమైంది. సాయంత్రంలోగా హోటల్ సామాగ్రిని మొత్తం ఖాళీ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.