ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి సీఎం గవర్నర్ వద్దకు వెళ్లారనేది అఫీషియల్ న్యూస్. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ మీటింగ్ వెనుక వేరొక పెద్ద రీజన్ ఉందని భయపడిపోతున్నారు. అదే సీబీఐ విచారణ. జగన్ అధికారంలోకి రాక మునుపే ప్రచారంలో టీడీపీ నేతల అవినీతి మీద ఎలా విచారణ జరిపిస్తారనేది స్పష్టంగా చెప్పేశారు. అవినీతికి పాల్పడిన ఒక్కరిని కూడ వదిలేది లేదని ఖరాకండిగా చెప్పేశారు. ఆప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతి మీద తవ్వకాలు మొదలుపెట్టారు. మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ అమరావతి భూముల కుంభకోణం, ఈఎస్ఐ, ఏపీ ఫైబర్ గ్రిడ్ లాంటి పలు అంశాల్లో అవినీతి జరిగిందని వివరాలను సేకరించారు.
అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్ విషయంలో సీఐడీ అరెస్ట్ చేస్తే జేసీ, ఆయన కుమారుడును నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పుతున్నారని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడెల శివప్రసాద్, అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి పి. నారాయణ, నమల రామకృష్ణుడు, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, బొండా ఉమా, గొట్టిపాటి రవి లాంటి వారి మీద కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు జైలుకు కూడ వెళ్ళవలసి వచ్చింది. ఇక అమరావతిలో భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాలు అంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్ లను సీబీఐకి అప్పగించాలని జగన్ గట్టిగా ట్రై చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో సీబీఐను రాష్ట్రంలోకి రానివ్వకుండా విధించిన నిబంధనలను కూడ ఎత్తివేశారు.
కానీ ఇంతలోనే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి సీబీఐ విచారం మీద స్టే తెచ్చుకోవడం జరిగింది. దాంతో జగన్ ప్లానింగ్ స్లో అయింది కానీ లేకపోతే ఈపాటికే టీడీపీ పెద్ద తలల మీద సీబీఐ ఎంక్వైరీ మొదలయ్యేది. తాజాగా జగన్, గవర్నర్ భేటీలో ఈ సీబీఐపై విచారణ అంశం కూడ చర్చకు రావొచ్చని, గవర్నర్ అనుకుంటే కేంద్రం నుండి పూర్తి సహకారం జగన్ కు అందుతుందని, అప్పుడు సీబీఐ నుండి తమను ఎవ్వరూ కాపాడలేరని టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అవినీతి చేశారా లేదా అనేది పక్కనపెడితే విచారణలోనే ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి రిమాండ్ ఖైదీలుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది కూడ. అందుకే తెలుగుదేశం నేతల్లో కంగారు మొదలైంది.