ప్రేమించిన అమ్మాయి కోసం రోడ్డు మీద కొట్టుకున్న ఇంటర్ స్టూడెంట్స్ (వీడియో)

వారు చదువుకోవాల్సిన విద్యార్దులు. అమ్మ అయ్యా చదువుకోండి బిడ్డా అంటే వారు కాలేజికి వెళ్లి ప్రేమ మైకాన పడ్డారు. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ది ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అదే అమ్మాయిని మరో అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఇద్దరు కూడా అసలు విషయాన్ని అమ్మాయికి చెప్పలేదు.

కానీ ఇంతలో దోస్తుల ద్వారా ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారని తెలుసుకున్నారు. అంతే ఇద్దరు కూడా గ్రూపులుగా ఏర్పడి తమ దోస్తులతో ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీలో రెచ్చిపోయి ఒకరికి ఒకరు కుమ్ముకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్ లో జరిగిం. వీడియో కింద ఉంది చూడండి.  

 

kurnool