Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా ఈయన కొనసాగుతున్నారు ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ ప్రజా నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక అభిమానులు ఎవరైనా తమకు ఆపద ఉందని వస్తే చాలు వెంటనే బాలయ్య వారికి నేనున్నా అనే భరోసా కల్పిస్తారు. తాజాగా అభిమాని కోసం ఈయన చేసిన పని తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
ఆదోనికి చెందిన బద్రిస్వామి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు రూ.20 లక్షలు ఖర్చవుతుందని పేర్కొనగా, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న బద్రిస్వామికి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించిన బాలయ్య తన చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.
ఈ సహాయాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా బద్రిస్వామికి అందజేశారు.బాలయ్య చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. బాలయ్య ఆపదలో ఉన్నామంటూ అభిమానులు తన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా సహాయం చేస్తారని గతంలో ఆయన చేసిన మంచి పనుల గురించి కూడా గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ఎంతోమందికి ఉచితంగా వైద్యం అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు.. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
