AP: జగన్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న బుగ్గన… బీజేపీలోకి జంప్….ఆ భయమే కారణమా?

AP: ఏపీలో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వైసిపికి చెందిన కీలక నేతలు పార్టీ మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి లాంటి ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇక ఎంతోమంది పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా పార్టీ నుంచి బయటికి రావడంతో జగన్ ఒంటరివాడు అవుతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా మరొక కీలక నేత కూడా పార్టీ మారటానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసిపి నుంచి బయటకు రాబోతున్నారని సమాచారం.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఐదు సంవత్సరాలపాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఇలా ఈయన ఓటమిపాలు కావడంతో తన వ్యాపారాలు కూడా ఇబ్బందులలో పడ్డాయని తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ఆ కేసులకు భయపడే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రాన్ని అప్పులు అడుగుతూ పెద్ద ఎత్తున బిజెపి నేతలతో పరిచయాలను పెంచుకున్నారు ఈ పరిచయాల కారణంగానే ప్రస్తుతం ఢిల్లీకే పరిమితమైన బుగ్గన అక్కడ కేంద్ర పెద్దలతో సంప్రదింపులు చేస్తూ బిజెపి పార్టీలోకి వెళ్లడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇలా బిజెపి నుంచి ఈయనకు సానుకూలత వస్తే మాత్రం ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెబుతూ బిజెపి తీర్థం పుచ్చుకోవటానికి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ బిజెపిలోకి రాబోతున్నారనే వార్త బయటకు రావడంతో ఏపీలో కూటమినేతలు మాత్రం ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ బుగ్గన బిజెపిలోకి రాకుండా మరి కొంతమంది కూడా బిజెపి పెద్దలకు రాయబారాలు పంపినట్టు సమాచారం.