జనసైనికులకు పవన్ విజ్ఞప్తి ఇదే

జనసేన కవాతు లక్ష్యం
“కవాతు మన లక్ష్యం కోసం..
కవాతు మన ధ్యేయం కోసం..
కవాతు మన రేపటి కోసం..
కవాతు మన బిడ్డల కోసం..
కవాతు.. జనసైనికుడై పదపద…

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం నాడు ధవలేశ్వరం బ్రిడ్జిపై ‘కవాతు’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి జనసేన కవాతు ప్రారంభం కానుంది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు బ్యారేజీపై రెండున్నర కిలోమీటర్ల వరకు జనసేన కవాతు జరగనుంది. అనంతరం సాయంత్రం 5గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి దగ్గర పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది. కాగా.. రేపు కవాతుకు వచ్చే జనసైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొన్ని సూచనలు, వినతులు చేశారు. రాజకీయ జవాబుదారితనమే జనసేన కవాతు ఉద్ధేశ్యం. నవతరం రాజకీయాల కోసమే జనసేన. శాసనకర్తల్లో రాజకీయ జవాబుదారీతనం రావాలి. హోదాపై జనసేన పోరాటం చేసినప్పుడు సీఎం ఎలా స్పందించారో ప్రజలకు గుర్తు చేయాలి” అని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
కవాతులో పాల్గొనబోతున్న జనసైనికులందరికి పవన్ విన్నపం, అభ్యర్ధన..

1.మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి, ఒక క్రమశిక్షణతో ముందుకు వెళదాం, కలిసి నడుద్దాం, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండండి.

2.మన కవాతుకు అండగా ఉన్న ఆడపడుచులకు, మహిళాశక్తికి మీరు రక్షణ కవచంలాగా నిలబడండి, తల్లి భవాని దేవి అనుగ్రహం పొందండి.

3.ముఖ్యంగా బైకుల్లో వచ్చే యువత వేగంగా రాకండి ఉత్సాహాన్ని కవాతులో చూపించండి. బైక్ ఆక్సిలేటర్ సౌండ్లతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఇంటి నుంచి జాతీయ స్ఫూర్తి తో కవాతుకు రండి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళండి.

4. మీ క్షేమం నాకు ప్రథమ భాద్యత. బైకుల్లో స్పీడ్ వెళ్ళేటపుడు మీ తల్లితండ్రులుని, నన్ను గుర్తు పెట్టుకోండి.. నిదానంగా రండి..  అని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.