తెలంగాణా ఒక చిత్రమయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో చాలా గ్రామాల్లో ప్రజలు మంత్రి హరీష్ రావు వంటి వాళ్లకు నీరాజనం పడుతున్నారు. మరొకవైపు టిఆర్ ఎస్ నాయకులు ప్రచారానికి రావద్దని తీర్మానాలు చేసి రూలింగ్ పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో చాలా వూర్లలో హరీష్ తప్ప మరొకరికి వోటేయమని ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. ఇళ్ల గేట్లకి బోర్డులు కూడా తగిలించేశారు. ఇలాంటి వార్తలు పత్రికాల్లో భూతద్దాలతో వెదికినా కనిపించవు. కనిపించినా చిక్కి శల్యమై ఎక్కడో చిన్నకాలమ్ లో బిక్కు బిక్కుమంటూ కనిపిస్తాయి.
మరొకవైపు కొన్ని వూర్లలో టిఆర్ఎస్ వాళ్లని వూర్లలోకి రానీయం అంటున్నారు. నాలుగేళ్లు అధికారంలోకులికావ్, దర్జాగా వూరేగావ్,మాకు చేసిందేమీలేదు, ఇచ్చిన హామీలేవు గాలికొదిలేశావ్, అందువల్ల మావూర్లోని నిన్నరానీయమని టిఆర్ ఎస్ సిటింగ్ లకు వార్నింగ్ లిస్తున్నారు.
ఇలాంటి గ్రామమే మర్కల్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో ఉంటుంది. అవూరి కధేందోచూడండి.
ఈ గ్రామం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సదాశివనగర్ మండలంలో ఉంటుంది. ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. 2014లో ఆయన టిఆర్ ఎస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ మీద 24వేల వోట్ల ఆధిక్యతతో గెలిచారు. రూలింగ్ పార్టీ కాబట్టి ఆయనమీద నియోజకవర్గం ప్రజలు చాలా ఆశలుపెట్టుకుని ఉన్నారు. అయితే, ప్రజలు నిరుత్సాహంతో ఉన్నట్లుందని మర్కల్ గ్రామం పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మర్కల్ టిఆర్ ఎస్ కు కంచుకోట అని చెబుతారు. అలాంటి కంచుకోట ఇపుడు ఆగ్రహం జ్వాలలు లేస్తున్నాయి. ప్రజలు సిటింగ్ మీద కోపం తో ఉన్నారు. నమ్మివోటేస్తే నువ్వుచేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి అవిచేస్తా, ఇవిచేస్తానని హామీ ఇచ్చి ఒక్కటన్నా చేశావా అని అరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి పింక్ జండాలు పట్టుకుని, మంది మార్బలాన్ని వెంటపెట్టుకుని, పాటలు జోరుగా వినిపిస్తూ వూర్లోకి వస్తున్నట్లు తెలిసింది. అంతే, వూరి ప్రజలంతా కలసి ఒక తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారామంటూ టిఆర్ ఎప్ నాయకులు వూర్లో కాలుపెడితే అడ్డుకోవాలని,టిఆర్ఎస్ నేతలు ఎవరు ఓట్లడగటానికి మావూర్లోకి రాకూడదని గ్రామస్తులు తీర్మానం చేశారు. మార్కూల్ ప్రజలకు ఇంతగా టిఆర్ ఎస్ మీద రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద కోపమొచ్చెందుకు కారణం ఏమిటి?
1. టీఆర్‌ఎస్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా 24 వేల ఓట్లతో గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి మా గ్రామానికి చెసిందేమీలేదు
2. మర్కల్ గ్రామంలో 18 నెలల క్రితం ఎంపీటీసీ సభ్యుడు మృతిచెందాడు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఏకగ్రీవం గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రు.25లక్షలిస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. ప్రజలు గ్రామం కోసం మిగతా పార్టీలను పోటీ నుంచి విరమింపచేశాయి . ఎంపిటీసీని ఏకగ్రీవంగా గెలిపించారు. ఎన్నుకున్నారుఇచ్చిన హామీ నెరవేర్చ లేదు.
అయితే, మూడు రోజుల కిందట పెద్ద ఎత్తున పోలీసుల సెక్యూరిటీ ఎనుగు రవీందర్ రెడ్డి గ్రామానికి వచ్చారు. అంత ఆగ్రహం పనికిరాదని, వారం రోజులలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రు. 5 లక్ష లో ఆఫీసు కట్టిస్తానని చెప్పి ఎస్ హెచ్ జి మహిళలను టిఆర్ ఎస్ కు ఫేవర్ గా తీర్మానం చేయాలని కోరారు. అయిదు లక్షలతో ఏం భవనం కట్టిస్తావని మహిళలు ప్రశ్నించారు. దీనితో ఆయన అనుచరులు, అబ్బే ఇది మొదటి విడత మాత్రమేనని ఆయన అనుచరులు మహిళలకు నచ్చ చెప్పారు. ఈ హామీలతో ఆయనను ప్రచారానికి అనుమతించారు. తర్వాత ఆయన పోలీసుల సహాయంతోనే గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. హామీలతో ఉద్రిక్తత చల్లారినట్లు కనిపించినా, ఈ పరిస్థితి రావడం, సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ ఉండటం సిటింగ్ కి ఏమీ నచ్చలేదు. రూలింగ్ పార్టీ అభ్యర్థికి రెండు గంటల పాటు గ్రామంలో చెమలు పట్టించారు. ఒకటే టెన్షన్ వాతావరణం. రైతులకు చెక్కులు, బతుకమ్మచీరెలు తీసుకున్నా, ఈ గ్రామంలో ఆగ్రహంపెల్లుబుకడం ఆశ్చర్యం. అంటే, ఈ చెక్కులు, చీరెలతో ప్రజలు చప్పట్లు కొడతారనుకోవడాని వీల్లేదా?
ఇదంతా అప్పోజిషనోళ్ల కుట్ర అని టిఆర్ ఎస్ నాయకులంటున్నారు. నిజమే అనుకుందాం. ఈ కథ నీతి ఏమిటి? మర్కల్ గ్రామం అపోజిషన్ కాంగ్రెస్ కంట్రో ల్ లోకి వెళ్లిందని చెబుతున్నారా. అది ప్రమాద సంకేతం కదా?