వెలిమినేడులో లాఠీఛార్జ్… టెన్షన్ టెన్షన్ (వీడియోలు)

మంగళవారం వెలిమినేడులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అమాయకులైన ప్రజల పై విచక్షణా రహితంగా లాఠీ చార్జీ చేశారు. దొంగల్లా చూసి తరిమారు. గ్రామస్థులు కూడా అంతే ప్రతిఘటించడంతో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జెసి వెంకట్ నారాయణ దెబ్బకు భయపడి పలాయనం చిత్తగించారని గ్రామస్థులు అన్నారు. అధికారులు, కంపెనీ వాళ్ళు బతుకు జీవుడా అంటూ బయట పడ్డారని పలువురు తెలిపారు. 

వెలిమినేడు గ్రామంలోని హిందీస్ పరిశ్రమ విస్తరణకు సంబంధించి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కంపెనీల వలన ఇబ్బందులు పడుతున్నమయ్యా… కాలుష్యం పెరిగితే మా బతుకులు ఆగం అయితయిరా బాబు అంటూ గ్రామస్థులు అంతా విన్నవించారు. లంచాలు తీసుకున్న కొందరు దుర్మార్గులు కంపెనీలకు అనుకూలంగా చెప్పారని వారు విరుచుకుపడ్డారు. కంపెనీలకు అనుకూలంగా ఓ వ్యక్తి మాట్లాడుతుండటంతో గ్రామస్థులంతా మా బతుకులు ఆగమైతయిరా బై అని మొత్తుకుంటుంటే సపోర్టు ఇస్తావారా… అని ప్రజలంతా ముక్తకంఠంతో అతని పై దాడి చేయడంతో సభలో గందరగోళం ఏర్పడి ఆగ మాగమైంది. .  ఉద్రిక్తతకు దారితీసిన వీడియో కింద ఉంది చూడండి.

 

VELIMINEDU PROTEST

సభలో గందరగోళంతో పోలీసులు గ్రామస్థులపై పిడిగుద్దులు గుద్దారు. గల్లాలు పట్టి లాఠీలతో కొట్టారు. పోలీసులు తరుముకొచ్చి  గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మహిళలను  మహిళా పోలీసులు కాకుండా మగ పోలీసులే నిలువరించారు. కొందరు మహిళలపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీనిని గ్రామస్థులు ఖండించారు. పోలీసు జులుం నశించాలి అని నినదించారు. అయినా కూడా కండకావరమెక్కిన పోలీసులు దున్నపోతులలా ప్రవర్తించి రాక్షసత్వం చూపారని పలువురు విమర్శించారు. పోలీసులు కంపెనీకి అనుకూలంగా వ్యతిరేకించి గ్రామస్థుల గొంతు నొక్కె ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థులంతా నిర్బందాల తెలంగాణ నుంచి విముక్తి పొందుతూ ఉద్యమించాలనే కాంక్షతో ఈ పాట.. వీడియో కింద ఉంది చూడండి.

 

https://youtu.be/JSZwCzF6bxI

గ్రామస్థులు అంతా వెలిమినేడు నేషనల్ హైవే-65 వద్దకు చేరుకొని ముట్టడించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తమ లాఠీలను చూపించి బెదిరించారు. ఆడవారు అని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. విద్యార్దులను తరిమారు. పోలీసులు అనుక్షణం రాక్షసత్వం ప్రదర్శించారని పలువురు పేర్కొన్నారు.

గ్రామంలో జరిగిన విధ్వంసానికి నిరసనగా బుధవారం వెలిమినేడు గ్రామ బంద్ కు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైనా చిట్యాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో విజయవంతంగా బంద్ కొనసాగింది. అఖిల పక్షం ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన కార్యక్రమాలు చేశారు. గ్రామంలో గ్రామస్థులు అంతా స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉద్యమ స్పూర్తిని కొనసాగిస్తామని ఎట్టి పరిస్థితిలో కంపెనీ విస్తరణకు ఒప్పుకునేది లేదన్నారు. అధికారుల నిర్ణయంతో త్వరలోనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళకు, విద్యార్దులకు, యువకులకు, ఉపాధ్యాయులకు, మహిళలకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు అంతా అభినందనలు తెలిపారు.