నిన్నటిదాకా కిటకిట లాడిన తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ వెల వెలబోతున్నది. ఫలితాల ట్రెండ్స్ మొదలయినప్పటి నుంచి నాయకులు గాంధీ భవన్ వైపు రావడం మానేశారు. మరొక వైపు టీఆర్ఎస్ భవన్ వద్ద సంబురాలు మొదలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యం వస్తున్నదన్న సత్యం కాంగ్రెస్ నేతలు గ్రహించడం, చాలా చోట్ల ాపార్టీ హేమా హేమీలు వెనకబజలో ఉన్న ప్రభావం గాంధీ భవన్ కాంపౌండులో కనిపిస్తా వుంది. దీనికి తోడు హరీష్ రావు వంటి టిఆర్ ఎస్ నేతలు భారీ ఆధిక్యతతో ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొద్దున్నే గాంధీ భవన్ కు వచ్చి, ఇక్కడి నుంచే ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఆయన రాలేదు.
మరోవైపు గాంధీభవన్ కార్యదర్శి కూడా అందుబాటులో లేరు. దీంతో గాంధీభవన్ లోని అన్ని తలుపులు కూడా ఇంకా తెరవని పరిస్థితి.
ఇదే సమయంలో బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి సందడి చేయడం ప్రారంభించారు. దీంతో టీఆర్ఎస్ భవన్ పరిసరాలు కోలాహలంగా మారగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు