ఫోటో చూస్తూ చంద్రబాబు ముఖచిత్రం ఊహించలేకపోతున్నాను!

నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగు దేశం నుండి బిజెపిలోకి ఫిరాయించిన నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనున్న ఫోటో పోస్ట్ చేస్తూ చంద్రబాబు ముఖచిత్రం  తాను ఊహించలేకపోతున్నానని ఒక వ్యంగ్యాస్త్రం సంధించాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకత్వం చేపట్టినప్పటినుండి రాంగోపాల్ వర్మ  తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాలు చెడిపోయాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాకుండా ఆపాలని హైకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నది.

ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని అవకాశం దొరికినప్పుడల్లా ఒక ఆట ఆడుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఫోటో పోస్ట్ చేశాడు.