బ్రేకింగ్ న్యూస్: బోధన్ లో ఏం జరగనుందో?

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్మన్ పై మరి కాసేపట్లో అవిశ్వాస తీర్మానం జరగనుంది. అవిశ్వాస ఓటింగ్ కు అసలు ఎంత మంది  కౌన్సిలర్లు పాల్గొంటారోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. తగిన కోరం లేకుంటే అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. చైర్మన్ కుర్చీ తమదేనన్న ధీమాలో అధికార పక్షం టిఆర్ ఎస్ ఉంది. మొత్తానికి మరికాసేపట్లో బోధన్ మున్సిపల్ భవితవ్యం తేలనుంది.