“బాలయ్య 107” నుంచి ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ని ప్లాన్ చేస్తున్నారా.?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మళ్ళీ హిట్ ట్రాక్ లో పడి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ లో 107వ సినిమాగా మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మాసివ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు 60 శాతం మేర కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వైరల్ అవుతుంది.

 

ఈ జూన్ లో బాలయ్య పుట్టినరోజు ఉండడంతో ఈ స్పెషల్ డే కి మాత్రం నందమూరి అభిమానులకి ఒక బర్త్ డే బ్లాస్ట్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య 107 సినిమా నుంచి టైటిల్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ టైటిల్ ని ఒక సాలీడ్ యాక్షన్ టీజర్ కట్ ని రిలీజ్ చేస్తారట.

 

ఇప్పటికే పలు పవర్ ఫుల్ టైటిల్స్ ని పరిగణలో ఉన్నాయని తెలిసిందే. ఇప్పుడు దీనినే ఆల్ మోస్ట్ అనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పలువురు బిగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ ఎస్ ఎస్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు.