ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి కొత్త జిల్లాల పాలన!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ కొత్త జిల్లాల ఏర్పాటును వేగవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాల విభజన సంబంధించిన పక్రియపై ఆయన స్పందించారు. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు.. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు . ఇప్పుడే ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే విభజన ఉంటుందని వెల్లడించారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చినట్లు వాటి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని వివరించారు.