ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆలోచనలకు ఆంధ్ర ప్రజలు బేజారవుతున్నారు. కాలం చెల్లిన ఆలోచనలు., అవుట్ డేటెడ్ డైలాగులతో ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో టీడీపీ చేసిన నినాదం ఫలించింది. కానీ ఐదేళ్ల కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని తెలుస్తుంది. దీంతో 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును యువత నమ్మలేదు. పైగా ఆయన ఆలోచనలు ఈ తరానికి సరిపోవని కూడా యువత గ్రహించింది. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర యువత జై కొట్టింది. జనసేన నేత పవన్ కళ్యాణ్ యువతను కొంత ఆకర్షించినప్పటికీ జగన్ వైపే యువత మొగ్గింది. దీంతో ఊహించని రీతిలో వైసీపీ సీట్లను పొంది అధికారం కైవసం చేసుకున్నది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ చంద్రబాబు ప్రసంగాలు విసుగు పుట్టిస్తున్నాయి.
ఇంగ్లీష్ మాధ్యమం విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. తనను టార్గెట్ చేసేందుకు అసెంబ్లీ పెట్టారని బాబు ఆరోపణలు చేయడం, ప్రజల సమస్యలపై పెద్దగా చర్చించకుండా తన సొంత ఇమేజ్ గురించి తహతహలాడడడంతో ప్రజలు చీరేత్తిపోతున్నట్లు తెలిసింది. పైగా తాను చేసిన పనులనే పదే పదే ప్రస్తావించడం కూడా బాబుకు మైనస్ అనే చెప్పవచ్చు. ఈ తరం యువత సమస్యలపై నిర్ణయాత్మక సూచనలు, సలహాలు చేస్తే బాబు గౌరవంగా ఉంటుందని ఆంధ్ర యువత కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా చంద్రబాబు వ్యవహరించడం లేదని వాదనలున్నాయి. అంతేకాకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజధాని నిర్మాణంలోనూ చంద్రబాబు ఐదేళ్లు టెండర్లతో కాలయాపన చేసి, ఇప్పుడు గగ్గోలు పెట్టడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో చంద్రబాబు ప్రజలు విశ్వసించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.