షాకింగ్: ఆ సీక్రెట్ రివీల్ చేసిన సుమ కనకాల

బుల్లితెరపై సుమ కనిపించిందంటే చాలు.. వద్దన్నా నవ్వులు పూలు పూస్తాయి. యాంకరింగ్‌లో టాప్ యాంకర్‌గా తనదైన ముద్ర వేయించుకున్న సుమ కనకాల తన పర్సనల్ లైఫ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

స్ర్కీన్‌పై నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సుమ కనకాల ఓ స్కిన్ డిజార్డర్‌తో బాధపడుతుందట. చాలా ఏళ్లుగా తనకీ స్కిన్ ప్రాబ్లమ్ ఉందని చెబుతోంది. కీలాయిడ్ టెండెన్సీ అను ఆ స్కిన్ ప్రాబ్లమ్ వల్ల ఏదైనా చిన్న గాయం తగిలినా, అది మెల్లగా చుట్టుపక్కల భాగాలకు కూడా వ్యాపించి పెద్ద గాయంగా మారిపోతుందట.

ఎన్నో రకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఆ సమస్య నుండి బయటపడడం సాధ్యం కాలేదంటోంది సుమ. చాలా ఏళ్లుగా ఈ సమస్య తనను వేధిస్తుందనీ, ఏమీ చేయలేక అంత పెద్ద సమస్యను కూడా నవ్వుతూ స్వీకరించి తన శరీరంలో భాగం చేసుకున్నాననీ చెప్పుకొచ్చింది.

మరో బుల్లితెర యాంకర్ రష్మి కూడా ఈ తరహా స్కిన్ డిసీజ్ గురించి గతంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, హీరోయిన్ సమంత కూడా ఒక రకమైన స్కిన్ డిజార్డర్‌తో బాధపడుతున్న సంగతీ అందరికీ తెలిసిందే.