సిరి – షన్ను: రేసులో వెనకబడ్డారెందుకు.?

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరూ యూ ట్యూబ్‌లో పాపులర్ ఫిగర్సే. అంతేకాదు, వీరిద్దరూ బయట నుండే మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ చాలా యాక్టివ్. అయితే, హౌస్‌లో మాత్రం డల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ తమ గేమ్‌ని లైట్ తీసుకుంటున్నారంటూ విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

సిరి హన్మంత్ విషయానికి వచ్చేసరికి తన గేమ్ తాను ఆడకుండా, షన్నుపై ఆధారపడిపోతోంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌తో కన్నా, షన్నుతోనే ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటోంది. నిజానికి సిరి చాలా టాలెంటెడ్. కానీ, తన టాలెంట్ ఎక్కడా బయట పెట్టే ప్రయత్నం చేయడం లేదు.

ఇక షన్ను విషయానికి వస్తే, ఎప్పుడూ లేజీ మూడ్‌లోనే ఉంటున్నాడు. ఏ షాట్‌లోనూ యాక్టివ్ మోడ్ చూపించడం లేదు. టాస్కుల్లోనూ పెద్దగా హైపర్ చూపించడం లేదు. లేటెస్ట్ కెప్టెన్సీ టాస్క్‌కోసం కూడా వీరిద్దరే ఓ పెయిర్‌గా జత కట్టారు. కాంపిటేషన్‌గా వచ్చిన యానీ, శ్వేతలతో పోల్చితే, వీరిద్దరికీ, ఈజీగా టాస్క్‌ కంప్లీట్ చేయగలిగే క్యాపబులిటీ ఉండి కూడా, సింపుల్‌గా ఓటమి చవి చూశారు.

హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఇదే విషయం పలు మార్లు ప్రస్థావించగా, వీరిద్దరూ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కూడా తమ బిహేవియర్‌లో ఏ మాత్రం మార్పు కనబరచలేదు. ఓవరాల్‌గా సిరి హన్మంత్, షణ్ముఖ్ ఆ జంట వ్యూహానికి గుడ్ బై చెప్పేయకపోతే, ముందు ముందు పరిణామాలు మరింత నెగిటివ్‌గా మారిపోతాయనేది నెటిజన్ల అభిప్రాయం.