లాక్ డౌన్ తో చాలా పెళ్లిల్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో సెలబ్రిటీ వెడ్డింగ్స్ ఉన్నాయి. నితిన్ పెళ్లి డిసెంబర్ కి వాయిదా పడింది. అయితే హీరో నిఖిల్ మాత్రం ముందే నిశ్చయించిన దివ్య ముహూర్తాన్ని మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకే తాను ప్రేమించిన డా.పల్లవి వర్మను పెళ్లాడేశాడు. ప్రస్తుత సన్నివేశంలో ఘనమైన పెళ్లి కంటే సింపుల్ వెడ్డింగ్ బెటర్ అని నిఖిల్ – పల్లవి తరపు బంధువులు నిశ్చయించారు. ఆ క్రమంలోనే కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే సింపుల్ గా పెళ్లి వేడుకను కానిచ్చేశారు. ఈ పెళ్లికి 50 మంది లోపే అతిధులు హాజరయ్యారు.
తాజాగా నిఖిల్ వెడ్డింగ్ కి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. పెళ్లి మంటపంలో నిఖిల్ – పల్లవి జంట ఎంతో చూడముచ్చటగా కనిపించింది. ఎంతో చిలౌట్ గా సరదాగా ఈ వేడుక సాగింది. నేపథ్యం కోసం ఎంచుకున్న పాటా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. నిక్ పాల్ హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం నిఖిల్ అభిమానుల సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
టాలీవుడ్ లోనే ట్యాలెంటెడ్ హీరోగా నిఖిల్ పేరు మార్మోగుతోంది. అతడి సెలెక్షన్ పై అభిమానులకు ఎంతో నమ్మకం. ప్రస్తుతం కార్తికేయ 2 సహా 18 పేజెస్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే నాలుగైదు స్క్రిప్టుల్ని ఇప్పటికే లాక్ చేశాడట. తదుపరి క్రేజీ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. లాక్ డౌన్ వేళ పెళ్లి వేడుకను కానిచ్చేశాడు కాబట్టి తదుపరి కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాడని తెలుస్తోంది.