టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చాలానే వుంది. అయితే అందులో ఒక్కరిద్దరు తప్ప పెళ్లి మాట ఎత్తడం లేదు. ఏళ్లు గడుస్తున్నా… యంగ్ ఏజ్ దాటి పోతున్నా పెళ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే ప్రభాస్ లాంటి హీరోలు పెళ్లంటే సాకులు చెబుతూ పారిపోతుంటే ఇద్దరు యంగ్ హీరోలు మాత్రం పెళ్లికి ఇదే కరెక్ట్ టైమ్ అంటూ ముందడుగు వేస్తున్నారు.
ఇప్పటికే డెస్టినేషన్ పెళ్లి కోసం, ఎంగేజ్‌మెంట్ కోసం నితిన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఏప్రిల్ 16న దుబాస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇప్పటికే గెస్ట్‌ల లిస్ట్‌ని ఫైనల్ కూడా చేసేశారు. ఈ నెల 15న ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఇదిలా వుంటే మరో యంగ్ హీరో ఏకంగా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ తంతుని పూర్తి చేయడం షాకింగ్‌గా వుంది. యంగ్ హీరో నిఖిల్ గత కొంత కాలంగా డాక్టర్ పల్లవి వర్మతో స్నేహంగా వుంటున్నాడు.
ఇద్దరి మనసులు కలవడంతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారట. తాజాగా డా. పల్లవి వర్మకు ఏకంగా ఈ కుర్ర హీరో ప్రపోజ్ చేశారట. వెంటనే ఆమెతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగేశాడు. ఇంత సైలెంట్‌గా నిఖిల్ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరి వివాహానికి డేట్‌ని కూడా ఫిక్స్ చేసేశారు. నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్న ఏప్రిల్ 16నే నిఖిల్ వివాహం జరగబోతోంది.