యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ భార్య డాక్టర్ పల్లవి వర్మ ఈరోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా వున్నారు. ఈ సందర్భంగా నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోలను పంచుకున్నారు నిఖిల్. సందర్భంగా నిఖిల్ అభిమానులు,స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2020లో నిఖిల్, పల్లవిల వివాహం జరిగింది.
ప్రస్తుతం పాన్‌ఇండియా మూవీ ‘స్వయంభూ’ లో నిఖిల్ నటిస్తున్నారు. దీంతో పాటు ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయి.