ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని వాపోతోందిట తనుశ్రీదత్తా. గత పది రోజులుగా తను ఆ రోజుల్లో లైంగిక వేధింపులకు గురి అయ్యానని, నానా పటేకర్ నానా రకాలుగా తనను వేధించాడని ఛానెల్స్ కు ఎక్కింది. తెలుగులో శ్రీరెడ్డిలా వరస పెట్టి ఆరోపణలతో ఇంటర్వూలు ఇచ్చేసింది. ఓ డైరక్టర్ తనను నగ్నంగా డాన్స్ చెయ్యమన్నాడంది. సర్లే కొత్త బకరా దొరికింది అన్నట్లుగా మీడియా వాళ్లు తెల్లారి గానే ఆమె ఇంటి ముందు మైకులు పట్టుకుని రెడీగా కూర్చుంటున్నారు. ఆమె చెప్పే ఎపిసోడ్స్ అందరికీ షాక్ ఇస్తాయనుకుంటే ..వాళ్లు కూల్ గా ..సర్లే గానీ పదేళ్ల క్రితం ఇవన్నీ జరిగితే
ఇన్నాళ్లూ ఏం చేసావు..ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏం సాధిద్దామని అంటూ నిలదిస్తూంటే నీళ్లు నములుతోంది. దానికి తోడు అమితాబ్ వంటి నటుడు తనకు సపోర్ట్ గా నిలబడలేదు అని తిట్టిపోసేసింది. తెరమీదేనా నీ హీరోయిజం అంటూ అనరాని మాటలు అనేసింది.
సర్లే ఇంతలా చెప్తోంది. ఈమె చేసిన సినిమాల్లో ఆమె ఎలాంటి పాత్రలు చేసింది అనీ ఈ తరం కుర్ర ప్రేక్షకులు ఆవేశపడి గూగుల్, యూట్యూబ్ తిరగేస్తే ..మాంచి హాట్ హాట్ సీన్స్ చేసిందని తేలింది. తెలుగులోనూ వీరభద్ర సినిమాలో బాలయ్యతో ఆడిపాడి అందాల విందు చేసింది. అయితే ఇక్కడ ఆమెను లెక్క చేసి మరో సినిమా ఇచ్చిన వాళ్లు లేరు. దాంతో ఇక తనకు సరైన సినిమా ఆఫర్స్ రావటంలేదని సినీ పరిశ్రమకు బై చెప్పేసి బుద్దిజం తీసుకుంది. అక్కడైనా బుద్దిగా ఉంటే ఇదిగో మళ్లీ నేను అన్యాయం అయ్యిపోయానంటూ అలసట వచ్చేలా రచ్చ చేస్తోంది.
ఇవన్నీ చూస్తున్న సినిమా జనం. ఊరుకోండి..ఈ మాటలు, మీడియా ముందు రచ్చ అంతా తిరిగి తన ఎంట్రీకే అని తీసిపారేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె తిరిగి ఇండస్ట్రీకి వచ్చినా ఏ పాత్ర చేయాలి..అక్క..లేక అమ్మ పాత్రలు చేయాలి..అంతకు మించి ఆఫర్స్ అయితే రావు..అయితే చిత్రం ఏమిటంటే అవీ ఆమె గుమ్మం తొక్కటం లేదట. దాంతో నేను విసుగు వచ్చేసింది ఇండస్ట్రీపై ..నేను మళ్లీ అమెరికా వెళ్లిపోతాను అంటూ బెదిరిస్తోంది. సర్లే వెళ్లమ్మా…నిన్ను ఆపేదెవరు…చెప్పు