త‌మ‌న్నా అత‌న్ని… ఓ ఆట ఆడుకోనుందా!

                                                                                (ధ్యాన్)

త‌మ‌న్నాకి వ‌రుడిని చూస్తున్నాం. మంచి వ‌రుడు దొరికితే పెళ్లి చేస్తాం అని ఆ మ‌ధ్య వాళ్ల అమ్మ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అదేమీ ప‌ట్ట‌న‌ట్టు త‌మ‌న్నా సినిమాల మీద సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ పోతోంది. తాజాగా ఈ భామ `అభినేత్రి2`కి సైన్ చేసిన‌ట్టు స‌మాచారం. `దేవి`గా మిగిలిన చోట్ల విడుద‌లైంది ఈ సినిమా. ఇందులో అమాయ‌కురాలిగా, అల్ట్రా మోడ‌ర్న్ గ‌ర్ల్ గా త‌మ‌న్నా స్పెక్టాక్యుల‌ర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందులో ప్ర‌భుదేవాకు భార్య‌గానూ న‌టించింది. సౌత్ హీరోయిన్ల‌లో ఇప్ప‌టికీ డ్యాన్సుల విష‌యంలో హీరోల‌కు గ‌ట్టిపోటీ ఇస్తున్న నాయిక‌గా త‌మ‌న్నాకు పేరుంది. అలాంటిది ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌భుదేవాతో క‌లిసి న‌టించ‌డం ఆమెకు అప్ప‌ట్లో చాలా ఆనందంగా అనిపించిన విష‌యం. `అభినేత్రి`లో ప్ర‌భుదేవా, త‌మ‌న్నా ఇద్ద‌రూ దంప‌తులుగా న‌టించారు. అందులో ప్ర‌భుదేవాను ఓ ఆట ఆడుకుంది త‌మ‌న్నా. తాజాగా సీక్వెల్‌లోనూ ప్ర‌భుదేవాను ఓ ఆట ఆడుకోనుంద‌న్న‌ది స‌మాచారం. అభినేత్రి సీక్వెల్ కూడా ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భుదేవా నిర్మాత‌గా, హీరోగా తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.