ఫస్ట్ లుక్ : యంగ్ హీరో …లింగ మార్పిడి

విభిన్నమైన పాత్రలు పోషించటానికి ఈ జనరేషన్ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం స్టోరీ లైన్ లోనే కాక గెటప్ లోనూ చిత్రంగా కనపడాలని ఉత్సాహం చూపుతున్నారు. ఆ మధ్యన విక్రమ్ ఇంకొక్కడు చిత్రంలో అలాంటి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు తమిళంలో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ సేతుపతి ఆ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ వదిలితే భీభత్సమైన రెస్పాన్స్
వచ్చింది. ఆ సినిమా పేరు సూపర్ డీలక్స్. లింగ మార్పిడి చేయించుకున్న యువకుడు పాత్రలో విజయ్ కనిపించి అలరించబోతున్నాడు.

రీసెంట్ గా ‘చెక్క చివంధ వానమ్’ (తెలుగులో ‘నవాబ్’), ‘96’ సినిమాలతో తన  ఫ్యాన్స్ కు పండుగ చేసిన   విజయ్ సేతుపతి.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పిచ్చెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో …విజయ్ సేతుపతి తో పాటు.. సమంత, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తమిళ దర్శకుడు తైగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం  ఫస్ట్  లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కామెడీనా లేక సోషల్ ఇష్యూగా లింగ మార్పిడిని చూపించబోతున్నారా అనేది సస్పెన్స్ అంటున్నారు.