తాత పాత్ర‌లో సుమంత్‌!

                                                                            (ధ్యాన్)

తాత పాత్ర‌లో న‌టించ‌డానికి సుమంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, రానా క‌లిసి సుమంత్‌కి `య‌న్‌.టి.ఆర్‌` క‌థ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ క‌థ విన్నాక‌, త‌న తాత పాత్ర‌కు ఉన్న ప్రాధాన్యం తెలుసుకున్నాక వెంట‌నే ఓకే చెప్పార‌ట సుమంత్‌. అయితే `మ‌హాన‌టి`లో ఏఎన్నార్ పాత్ర‌ను నాగ‌చైత‌న్య పోషించారు. ఈ సినిమాలో సుమంత్ ని సంప్ర‌దించారు. తెలుగు సినిమాకు య‌న్‌.టి.ఆర్‌, ఏఎన్నార్ రెండు క‌ళ్ల‌లాంటివార‌న్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ఈ సినిమాలో య‌న్‌.టి.ఆర్‌గా బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఆయ‌న స‌ర‌స‌న కొన్ని స‌న్నివేశాల్లోనైనా ఎ.ఎన్‌.ఆర్ పాత్ర ఉంటుంది. దాన్ని బ‌ట్టి సుమంత్ ఆ పాత్ర కోసం సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఆయ‌న ప్ర‌స్తుతం `సుబ్ర‌మ‌ణ్య‌పురం` షూటింగ్‌లో ఉన్నారు. `యన్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ గురించి “ చాలా ఆనందంగా, అత్యుత్సాహంగా, గౌర‌వంగా ఉంది. య‌న్.టి.ఆర్‌గారి బ‌యోపిక్‌లో తాత‌గారి పాత్ర‌లో న‌టించబోతున్నాను ` అని ప్ర‌క‌టించారు.