సొగసరి అందం సంపుడేగా
అందం అంటే నువ్వా…! అంటూ ఓ సినీకవి వర్ణించిన తీరుగానే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చక్కనమ్మ అందం చూశాక పరేషాన్ అవ్వకుండా ఉంటారా ఎవరైనా?
ది గ్రేట్ సోనమ్ కపూర్ స్టైలింగ్ గురించి ఫ్యాషన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అనీల్ కపూర్ వారసురాలిగా సినీరంగంలో ప్రవేశించినా తనదైన ప్రతిభతో రాణించిన ఈ అమ్మడు నటవారసత్వం అన్న సూటి పోటి మాటల్ని వినేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉండదు. తనని ఎవరైనా అలా కపూర్ డాటర్ అనాలని ప్రయత్నిస్తే వెంటనే రివర్స్ లో తిట్టేస్తుంది.
అదంతా సరే కానీ.. సోనమ్ లోని ఫ్యాషనిస్టాని సంతృప్తి పరిచే కొన్ని ఫోటోలు ఇటీవల ఇన్ స్టాలో దర్శనమిస్తున్నాయి. వీటిలో లేటెస్టుగా లోహకన్యను తలపించేలా రాగితో తయారు చేసిన దుస్తుల్లో కనిపించి షాకిచ్చింది. కాంబినేషన్ గాజుల్ని సైతం రాగి ధాతువుతోనే తయారు చేయడం ఇంట్రెస్టింగ్. ఒక రకంగా దేవకన్యనే తలపిస్తోంది. విరహంతో వీగిపోతున్న దేవకన్యనే తలపిస్తోంది.