పంచభూతాలలో ఒకటిని తన కొడుకుకు నామకరణం చేసిన సోనమ్ కపూర్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సోనమ్ కపూర్. సావరియా అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె నటిగా ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోవడంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఈ క్రమంలోనే 2018లో తన ప్రియుడు ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్నటువంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆగస్టు 20వ తేదీ తనకు కుమారుడు పుట్టారంటూ ఆనంద్ అహుజా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇక అప్పటినుంచి సోనమ్ కపూర్ తన కుమారుడికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన కుమారుడికి ఈ దంపతులు నామకరణం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పంచభూతాలలో ఒకటైనటువంటి వాయువు పేరును తన కొడుకుకు నామకరణం చేశారు. ఈ క్రమంలోనే తన పుత్రుడికి వాయు అనే పేరును పెట్టామని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా తన భర్త కుమారుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

మా జీవితాలకు కొత్త ఊపిరి జోడించిన హనుమంతుడు మరియు భీముడు ధైర్యానికి శక్తికి చిహ్నం. తన కుమారుడు వాయు కపూర్ అహుజాకు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.