(సూర్యం)
‘నా పేరు చైతన్య. ముద్దుగా అందరూ చైతు అంటారు. దేన్నైనా పాజిటీవ్‌గా తీసుకునే సున్నిత స్వభావం నాది. మనం లైఫ్‌లో ప్రేమించే ప్రతిదాని వెనుక ఓ కష్టం ఉంటుంది. అది మనం తట్టుకోగలిగితే లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలా అని దేవుడు నా లైఫ్‌ను సజావుగా పోనివ్వడు కదా. పుట్టినప్పుడు ఒకర్ని డాడీ రూపంలో.. ప్రేమించడానికి ఒకర్ని అను రూపంలో.. పెళ్లి జరగడానికి అత్త రూపంలో మరొకర్ని ఇచ్చి గట్టిగా తొక్కేశాడు’ అంటూ రెండు వారాల క్రితం థియోటర్లోకి వచ్చేసాడు నాగచైతన్య. అయితే అల్లుడు అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేడంటూ జనం నసిగేసారు. దాంతో కలెక్షన్స్ కూడా కేర్ కేర్ మంటున్నాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్ షేర్ 1.35 కోట్లు ఈ 11 రోజులకు వసూలు అయ్యిందని …మొత్తం రావాల్సింది 17.65 కోట్లు అని చెప్తున్నారు. దాంతో ఇక రాబోయే రోజుల్లో రికవరీ కష్టమని, ఫ్లాఫ్ అని తేల్చారు. దాదాపు 75 శాతం ఇంకా రికవరీ కావాల్సి ఉంది. ఓవర్ సీస్ లో అయితే పెద్ద డిజాస్టర్ గా నమోదైంది. నైజాంలో అయితే నడక చాలా కష్టం గా ఉంది.
నాగచైతన్య నటించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. గోపీ సుందర్ బాణీలు అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఎస్.రాధాకృష్ణ సినిమాను సమర్పించారు.