నా బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి ప్లీజ్ – రాశి ఖన్నా

టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నాకు ఇక ప్రతీ రోజూ పండగేనట! ఎందుకు? అనేగా మీ డౌట్? అక్కడికే వద్దాం.. తెలుగు, తమిళం ఇలా రెండు భాషల్లో బిజీ బిజీగా సినిమాలు చేసేస్తూ క్షణం తీరిక లేకుండా కెరీర్ ను లాక్కొస్తుంది. అంతేకాదు, నిర్మాతలను కుడా తన చుట్టూ తిప్పుకుంటూ పారితోషికాన్ని సైతం తనకు ఇష్టమొచ్చిన రీతిలో పెంచేస్తూ  తెగ ఇబ్బందీ పెడుతుందట.
 
తాజాగా ఈ బ్యూటీ తెలుగులో వెంకీ మామ,  ప్రతీరోజూ పండగే సినిమాల్లో నటిస్తూ, తమిళంలో మరో రెండు చిత్రాలకు సైన్ చేసిందట. అందుకే కెరీర్ పరంగా ఇక తనకు  ప్రతీరోజూ పండగేనంటోంది రాశీఖన్నా. ఇవేగాక, తెలుగు,తమిళం లో చేతినిండా చిత్రాలు ఉన్నాయని కలిసిన చోటల్లా.. పరిశ్రమ జనాలకు డప్పు వాయిస్తోందట. ఇదీ.. సరే! మరి రాశీఖన్నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తను ఏమంటోందో? తెలుసుకోవాలని ఆశగా ఉంది కదా? అవును.. అందరికీ అలాగే ఉంటుంది మరి.  ఈ బ్యూటీపై హీరోలతో రొమాన్స్, పారితోషికం విషయంలో నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడంలాంటివి  సోషల్ మీడియాలో గుప్ప మంటున్నాయి.
 
వీటి గురించి రాశీఖన్నాను షూటింగ్ గ్యాప్ లో కలిసినప్పుడు కదిలించాను… అప్పుడు రాశీఖన్నా చిర్రు బుర్రుమంటూ -” సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరో చెప్పగా విని, నాకు నేనే నవ్వుకుంటున్నా. నాకు ఫలానా  హీరోతో లింకు పెట్టి పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పనే  చెప్పరు.. నాకూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది”  అంటూ నవ్వులు చిందిస్తోంది రాశీఖన్నా. అలాం టి పోస్టులు తన కెరీర్ కు ఏ విధమైన హానిని కలిగించలేవు అని గట్టిగానే చెబుతుంది. ఇక పారితోషికం మాట గురించి మాట్లాడకపోతేనే బెటర్! ఎందుకంటే తానేంటో  నిర్మాతలకు బాగా తెలుసునంటోంది! అమ్మో..రాశీఖన్నా గడుసుపిండమే సుమా!