తెలుగు సినీ నటి సమంత గత కొంతకాలంగా మాయోసిటిస్ వారితో బాధపడుతున్నట్లు తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి సమంత గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈమె చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు, సినీ సెలెబ్రెటీలు సమంతకు ధైర్యం చెబుతున్నారు.
సమంత అనారోగ్య సమస్య నుంచి త్వరగా బయటపడాలని,కోరుకుంటూ ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఆమెకు ధైర్యం నింపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అఖిల్, రాసి ఖన్నా, హన్సిక జెనీలియా వంటి ఎంతోమంది సెలబ్రిటీలు సమంతకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత అనారోగ్యంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాలానికి అనుగుణంగా మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మనలో ఉన్న అంతర్గత శక్తి తెలుసుకోవడానికి ఆ సవాళ్లు ఎదురవుతుంటాయి. సమంత ఎంతో అద్భుతమైన అమ్మాయి తనలో ఎంతో అంతర్గత శక్తి ఉంది. ఆమె త్వరలోనే ఈ అనారోగ్య సమస్య నుంచి బయట పడుతుందని కోరుకుంటున్నాను సమంత ఎంతో ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.