* అప్పుడే వీరికి ఇంత పొగరెందుకు? అని కూడా అంటున్నారు
* నిర్మాతలకు పగలే చుక్కలు చూపిస్తున్నారట
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ముచ్చటగా ముగ్గురు భామల గురించే చెప్పుకుంటున్నారు. ఆ ముగ్గురికి ఫోజులెక్కువయ్యాయట!? ఇంతకీ ఆ ముగ్గురు భామలు ఎవరనేగా మీ డౌట్!? అక్కడికే వద్దాం. ఆ ముగ్గురిలో ఒకరు పూజాహెగ్డే. అవును..మీరు విన్నది నిజమే! ఈ బ్యూటీ ఒక మామూలు సినిమాలో నటించడానికి కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుండడంతో అందరూ షాక్ అవుతున్నారట. అలా షాక్ అయిన వారంతా పూజను వదిలి ఆ ప్లే సులో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో విజయాల దారిలో ఉంది. ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’ తర్వాత… తాజాగా ‘అల.. వైకుంఠపురంలో’ ఈమెకు మరో హిట్ అందించింది. ఇదే ఊపులో ప్రభాస్‌తో నటిస్తోంది. అయితే.. వరుసగా రొటీన్ సినిమాలలో చేస్తున్న పూజాకి.. అడివి శేష్ ‘మేజర్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించే ఆఫర్ వచ్చిందట. ముంబై ఎటాక్స్‌లో అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ‘మేజర్’ చిత్రం చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సోనీ పిక్చర్స్ తో కలిసి మహేశ్‌బాబు నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలోని కీలకమైన రోల్‌కి పూజా హెగ్డేని సంప్రదించిందట నిర్మాతల్లో ఒకరైన నమ్రత శిరోద్కర్. ఈ పాత్ర చేయడానికి ఓ.కె. చెప్పిన పూజా.. ఏకంగా రెండు కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసిందట. అడివి శేష్ హీరో గా చేసే సినిమాలో నటించేందుకు.. అంత భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో యూనిట్ షాకయ్యిందట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచించారట.
ఇక అందాల తార రాశీఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే! ఎందుకంటారా? ఆమె ఫోజులు చూసి ఇండస్ట్రీ వర్గాలే కాదు.. ఆమె సన్నిహితులుకూడా విస్తుపోతున్నారట. తను ఏ సినిమాలో నటించాలన్నా ముందుగా తన రెమ్యునరేషన్ గురించే మాట్లాడుతుందట. అప్పుడే ఇంత పొగరెందుకు? అని కూడా అంటున్నారట. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమైందట రాశీఖన్నా. అవును మరి!? టాప్ హీరోయిన్ లను చూసి రాశీఖన్నా కూడా బాగానే నేర్చుకుంది.
ఇక తమన్నాగురించి చెప్పుకుందాం… ఈ మిల్క్ బ్యూటీ కి గత ఏడాది తెలుగు, తమిళంలో మంచి విజయాలే దక్కాయి. దాంతో తన రెమ్యునరేషన్ అమాంతంగా కోటి పెంచేసిందట .అంతకు ముందు కోటి వరకూ తీసుకునేది. ఆమె కొత్త రేటు తెలియని నిర్మాతలు ఇప్పుడు ఆమె డేట్ల కోసం వెళితే ఏకంగా రెండుకోట్లు అడుగుతోందట. కాల్‌షీట్లు ఎన్నైనా కానీ రెండు కోట్లు ఇవ్వాల్సిందే ‘ అంటూ ఖరాఖండిగా చెప్పడంతో నిర్మాతలకు పగలే చుక్కలు కనపించినంత పనయిందట.