సమంత మళ్లీ మొదలెట్టేసింది.. ఇక తట్టుకోవడం కష్టమే!!

Samantha Latest Workouts Goes Viral

అక్కినేని కోడలు సమంత లాక్ డౌన్‌లో ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఓ వైపు అర్బన్ వ్యవసాయంలో శిక్షణ తీసుకుంటూనే ఇంటి డాబాపై కూరగాయలు, పండ్లు పండించడం మొదలెట్టేసింది. మరో వైపు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు ఎలా వండాలో నేర్చుకుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఓ శిక్షకురాలిని పెట్టుకుంది. ఇవన్నీ కాకుండా తన డ్రీమ్, తన బేబీ అని చెప్పుకుంటోన్న సాకీ వరల్డ్ బ్రాండెడ్ ఫ్యాషన్ డిజైనర్ దుస్తులకు సంబంధించిన పనులను చూసుకుంది.

Samantha Latest Workouts Goes Viral
Samantha Latest Workouts Goes Viral

ఇలా లాక్ డౌన్ మూలంగా దొరికిన ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంది. సాకీ వరల్డ్‌తొ తన లక్ష్యాన్ని కూడా చేరుకుంది. అయితే ఈ క్రమంలో సమంత వ్యాయామం జోలికి వెళ్లినట్టు కనిపించలేదు. ఇన్ని పనుల మధ్య తన ఫిట్ నెస్‌పై అంతగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. కేవలం యోగా వంటివే చేసింది. అయితే తాజాగా సమంత జిమ్‌లో అడుగుపెట్టింది. ఆ మధ్య ఉపాసన స్థాపించిన URLIFE అనే వెబ్ సైట్ ఇంటర్వ్యూ కోసం జిమ్‌లో వర్కవుట్లు చేసింది.

తాజాగా సమంత మళ్లీ కఠిన వ్యాయామాలను చేసేందుకు రంగంలోకి దిగింది. అప్పట్లో భర్త, మామలకు ధీటుగా బరువులను మోసేది. ఏకంగా వంద కేజీల బరువునెత్తి ఆశ్చర్య పరిచింది. తాజాగా సమంత మళ్లీ తన పాత రోజుల్లోకి వెళ్లిపోయింది. జిమ్ ట్రైనర్ నేతృత్వంలో మళ్లీ కసరత్తలు ప్రారంభించింది. అసలే ఇప్పుడు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, రష్మిక మందాన్న వంటి వారంతా జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. ఇక వారికి పోటిగా, ధీటుగా సమంత కూడా రంగంలోకి దిగింది.