శంకర్ శంకర్ మధ్యలో గుడుంబా శంకర్

                                                                            (ధ్యాన్) 

చిరు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయ‌ని ఫొటోలు చూసిన ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. మెగా కుటుంబాల‌న్నీ పిల్లాపాప‌ల‌తో వ‌చ్చి చిరంజీవిని క‌లిసి విష్ చేసి క‌లిసి ఫొటోలు తీసుకున్నారు. ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ చిన్న మ‌ర‌ద‌లు… అదేనండీ ఇంట‌ర్నేష‌న‌ల్ మ‌ర‌ద‌లు 

అన్నా లెజెనోవా కూడా చిరంజీవిని క‌లిశారు. బొకేతో బావ‌గారికి విషెస్ తెలిపారు. పిల్ల‌లు పొలేనా కొణిదెల‌, మార్క్ శంక‌ర‌ప‌వ‌నోవిచ్ కొణిదెల‌ను కూడా చిరు ఇంటికి తీసుకొచ్చారు. పాప కాస్త భ‌యం భ‌యంగా త‌ల్లి కొంగు ప‌ట్టుకుని నిలుచుంది. కొడుకు మాత్రం ఏమీ తెలియ‌ని వ‌య‌సు క‌దా.. త‌ల్లి చంక‌లో చ‌క్క‌గా కూర్చున్నాడు. ఫొటోల్లో తెగ ముద్దొచ్చేస్తున్నాడు. త‌న పిల్ల‌ల‌తో పాటు బాబాయ్ పిల్ల‌ల‌ను కూడా తానే ఎక్కువ‌గా చూసుకుంటున్న‌ట్టు ఈ మ‌ధ్య చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ చెప్పింది. సో చిరంజీవి ఇల్లు పొలేనాకు, మార్క్ శంక‌ర‌ప‌వ‌నోవిచ్‌కు కొత్త కాదు. కాక‌పోతే త‌ల్లిదండ్రులు, పెద‌నాన్న‌.. ఇలా క‌ల‌వ‌డం మాత్రం కాస్త కొత్త‌గా, బెరుగ్గా ఉన్న‌ట్టుంది. ఎట్టైతేనేం… కుటుంబం అంతా క‌లిసి ఆనందంగా ఇంటిపెద్ద పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించార‌న్న‌మాట‌.