ప‌వ‌న్ క‌ల్యాణ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్..  ఓ సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శలో ఉన్న ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తుండ‌గా.. ప‌వ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తారు. డాలీ ద‌ర్శ‌కుడు. రామ్ తాళ్లూరి నిర్మాత‌. అంతా బాగానే ఉంది కానీ.. ప‌వ‌న్‌ను ఈ సినిమా న‌టింప చేయ‌డానికి నిర్మాత భారీ రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేశార‌ట‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు 50 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేశార‌ట‌. అదీగాక ప‌వ‌న్ ఇచ్చే డేట్స్ కూడా 20 రోజుల పాటే ఉంటుంద‌ట‌. ఈ ఇర‌వై రోజుల్లో ఆయ‌న పోర్ష‌న్‌ను కంప్లీట్ చేసుకోవాల‌ని ఆయ‌న సూచించార‌ట‌. ద‌క్షిణాది ఓ కీల‌క పాత్ర‌లో న‌టించే న‌టుడికి ఇంత మొత్తంలో అమౌంట్‌ను రెమ్యున‌రేష‌న్‌గా ఇవ్వ‌డ‌మంటే ఇది ఓ రికార్డే. సినిమా స్టార్ట్ కాక ముందే ప‌వ‌న్ ఓ రికార్డ్ కొట్టేసిన‌ట్టేగా మ‌రి!