చూసారా? :ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కొత్త ఫొటో

నందమూరి తారకరామారావు తన మొదటి సినిమా రంగప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 69 సంవత్సరాలు అయ్యిన సందర్బంగా ఎన్టీఆర్ బయోపిక్ యూనిట్ తమ చిత్రంలో ‘మనదేశం’కు చెందిన స్టిల్ ని రిలీజ్ చేసారు. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ లా కనిపిస్తూండగా, బెంగాళి నటుడు జిష్ణు సేన్ గుప్త..ఎల్వీ ప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పడీ స్టిల్ ఎన్టీఆర్ అభిమానులకు పండగలా ఉండి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

 

అసలు ఎన్టీఆర్ బయోపిక్ ని.. మనదేశం సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో మొదలెట్టారు ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.

మహానీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ముందుగా వేసుకున్నప్లాన్ ప్రకారం షెడ్యూల్స్ తూచ తప్పకుండా జరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ తో పాటే ప్రమోషన్ కూడా జరిగిపోతోంది. సినిమాలో కీలక పాత్రధారులు షూటింగులో జాయిన్ కావడం ఆలస్యం .. వాళ్ల పోస్టర్లు బయటికి వచ్సేసి క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

సినిమా మొదటి భాగం షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, సెకండ్ పార్ట్ మిగిలిన కొన్ని సన్నివేశాలపై దర్శకుడు క్రిష్ కసరత్తులు చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.  

విద్య బాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం.