యారొగెంట్ నెప్టోయిజంలో కపూర్ సిస్టర్స్ ఫికర్
కొన్ని చర్యలు రకరకాల సందేహాల్ని మోసుకొస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో నెప్టోయిజం గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ బయటి నుంచి వచ్చిన యువహీరో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం అనంతరం నటవారసత్వంపై విరుచుకుపడుతున్నారంతా. ముఖ్యంగా కపూర్ గాళ్స్ కి ఊహించని విధంగా నెటిజనుల నుంచి ట్రోలింగ్ ఎదురైంది.
అయితే దీనికి ఈ సిస్టర్స్ ఇదిగో ఇలా కౌంటర్ ఇచ్చారు మరి. కరిష్మాకపూర్ బర్త్ డే సందర్భంగా సిస్టర్ సోనమ్ కపూర్ తనకి ఓ హగ్ ఇచ్చి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యల్ని చేసింది. హార్డ్ వర్క్ ట్యాలెంట్ తో కపూర్ గాళ్స్ కి ఒక మార్గం నిర్మించిన గొప్ప వీరనారి!.. నీవల్లనే మేమంతా ఇక్కడ ఉన్నాం!! అంటూ కాస్త ఈగోయిస్టిక్ నెప్టో క్యారెక్టరిస్టిక్ వ్యాఖ్యల్ని చేసింది. దీనికి స్వీట్ గాళ్! అంటూ కరీనా ఇచ్చిన రిప్లయ్ ఇంకా మంట పుట్టించింది నెటిజనులకు.
తాజా వ్యాఖ్యలకు మరోసారి సోషల్ మీడియాల్లో నెటిజనులు విరుచుకుపడుతున్నారు. సిస్టర్స్ ఇద్దరూ యారొగెంట్ .. ఈగోయిస్టిక్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కపూర్ వారసురాళ్లలో ఇది తగ్గాలన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే సుశాంత్ సింగ్ ఇన్సిడెంట్ తర్వాత తమపై వస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టేందుకే సోనమ్ ఇలాంటి వ్యాఖ్యల్ని చేసిందన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అందుకే ఇలా ట్రోల్స్ తప్పడం లేదు.