నయనతార సహజీవనం వెనక వింత లాజిక్,వింటే మైండ్ దొబ్బుద్ది

                                                             (సూర్యం)

కెరీర్ లో  ఎంత వెలుగు వెలిగినా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉంటూంటారు హీరోయిన్స్. అయితే నయనతార దీనికి భిన్నంగా  కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం అలాంటి ఆలోచనే లేదంటోంది. ఓ ప్రక్కన విఘ్నేష్ అనే దర్శకుడుతో సహజీవనం చేస్తోంది తప్ప వివాహ బంధంలోకి రావటానికి ఆసక్తి  చూపటం లేదు. అయితే అందుకు కారణం చాలా వింతగా ఉంది. ఆమెకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనే అంటున్నారు.దానికి ఈ పెళ్లిళ్లుకు లింక్ ఏంటంటారా…

కెరీర్ స్టార్ట్ చేసి 14 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ అందం క్రేజ్ చెక్కు చెదరని స్టార్ నయనతార. అతి  తక్కువ టైంలో 50 సినిమాలు పూర్తి చేసింది. అడుగుపెట్టిన ప్రతి  భాషలోనూ క్రేజీ హీరోయిన్ గానే వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలా ఇన్ని భాషలను ఏలిన హీరోయిన్ ఈ మధ్యకాలంలో నయన తప్ప మరొకరు లేరు. ఓ ప్రక్క చిత్రాతి చిత్రమైన  కాంట్రవర్సీలతో కాపురం చేసినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

తమిళ్ యంగ్ హీరోలు ఆర్య.. జయం రవి తో నుంచి  సీనియర్ హీరో రజనీకాంత్ తో కూడా ఆడిపాడింది. ఇక తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లాంటి స్టార్  హీరోలతో ఆడిపాడిన నయనతార ఆ తర్వాత రానాలాంటి యంగ్ హీరోతోనూ జోడీ కట్టి ఇప్పటికీ తనేంటో చాటి చెప్పింది. అంతాబాగానే ఉంది… కానీ పెళ్లి ఊసు  మాత్రం ఎత్తటం లేదు. కుటుంబ సభ్యులను కూడా ఆ విషయమై మాట్లాడద్దొని చెప్పిందిట. అందుకు కారణం ఆమె జ్యోతిషాన్ని బాగా నమ్మటమే అంటున్నారు.

ప్రభుదేవాతో విడిపోయాక అసలు తన పరిస్తితి ఏమటి అంటూ స్నేహితుల సలహాపై  ఓ జ్యోతిష్కుడు దగ్గరకు వెళ్లిందిట. అప్పుడు ఆ జ్యోతిష్యుడు  చెప్పిన  మాటలును అనుసరించే ఆమె వివాహానికి దూరం అయ్యిందిట. ఆ జ్యోతిష్యుడు ఏమి చెప్పాడు అంటే.. నయనతార జాతకం బ్రహ్మాండంగా ఉందట.

అయితే  ఆమె పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోతే తప్పకుండా రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అవుతుందని చెప్పాడట. ఆయన మాటలు వినే.. నయన ఇంత వరకూ పెళ్ళి  చేసుకోలేదనీ సినీజనాలు అంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది నయనతారకే తెలియాలి.