MLC Kavitha: తప్పకుండా నేను ముఖ్యమంత్రిని అవుతా… ఎదగాలని ఎవరి కోరుకోరు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే విధంగా బిఆర్ఎస్ లో రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈమె తన పార్టీకి కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈమె బి ఆర్ ఎస్ నుంచి బయటకు వస్తున్నారా.. కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటూ ఎన్నో రకాల సందేహాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఈమె రాజకీయాలలో కాస్త దూకుడు పెంచుతూ జాగృతి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. జాగృతి సంస్థ ఉద్యమం నుంచే ఉండగా..ఉద్యమంలో సాంస్కృతిక అంశాలపై పోరాడింది. మరోసారి దీనిని బలోపేతం చేయడానికి కవిత కృషి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత తన రాజకీయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు . ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ముఖ్యమంత్రి కావడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు రాజకీయాలలో కొనసాగుతూ ముఖ్యమంత్రి అవుతారా అంటూ ప్రశ్న ఎదురు కావడంతో తప్పకుండా తాను ముఖ్యమంత్రిని అవుతానని తెలియజేశారు.

ఇప్పుడు కాకపోయినా ఓ పది సంవత్సరాలకు లేదా 15 సంవత్సరాలకు తాను ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తెలిపారు. అలాగే రాజకీయాలలో ఎదగాలని ఎవరైతే కోరుకోరు చెప్పండి అంటూ కవిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికలలో బిఆర్ ఎస్ పార్టీ గెలిస్తే నిజామాబాద్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఊహకు అందని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాము అంటూ ఈ సందర్భంగా కవిత తెలియజేశారు. ప్రస్తుతం ఈమె ముఖ్యమంత్రి అవుతానంటూ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.