మేక‌ప్ మేన్‌కు రాఖీ కట్టిన మెహ్రీన్..!

                                                                         (ధ్యాన్)

నాయిక అందం తెర‌మీద రెట్టింపు కావాలంటే త‌ప్ప‌కుండా మేక‌ప్ మేన్ స‌హ‌కారం ఉండాల్సిందే. మేక‌ప్ ఎంత పొందిగ్గా కుదిరితే అంత బాగా ఉంటుంది సిల్వ‌ర్ స్క్రీన్ మీద వారి రూపం.అందుకే కార్య‌క్రమం చిన్న‌దైనా, పెద్ద‌దైనా, పాత్ర  ఎలాంటిదైనా క‌థానాయిక‌లు మేక‌ప్‌తో ఇట్టే ఆక‌ట్టుకుంటారు. ఆ మేక‌ప్ ప్రాధాన్య‌త తెలిసిన వారు అతి కొద్దిమందే. అందుకే వారు టెక్నీషియ‌న్ల‌కు అమిత‌మైన గౌర‌వాన్నిస్తారు. తాజాగా అలాంటి న‌టీమ‌ణుల కోవ‌లోకి చేరింది మెహ‌రీన్. ఈ భామ ప్ర‌స్తుతం ఎఫ్‌2 చిత్రంలో న‌టిస్తోంది. ఆ సినిమాలో మేక‌ప్ మేన్‌గా ప‌నిచేస్తున్న రామ‌కృష్ణ కాస‌ర‌కు రాఖీ క‌ట్టింది. `రామ‌కృష్ణ కాస‌ర అన్న నాకు చాలా స్పెష‌ల్‌. ప్ర‌తి రోజూ న‌న్ను మేక‌ప్‌తో బ్లెస్ చేస్తారు` అని అన్నారు.