పవన్ కళ్యాణే.. ‘హైపర్‌ ఆది’కి జబర్దస్త్ ఎంట్రీ ఇప్పించాడా?

 
 
 ‘జబర్దస్త్‌’ లో హైపర్ ఆది జోక్స్ కు, పంచ్ లకు నవ్వని వారు ఉండరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు భక్తుడైన హైపర్ ఆది…ఆయన వల్లే జబర్దస్త్ లోకి రాగలిగాడు అంటే నమ్ముతారా…అలాగని పవన్ కళ్యాణ్ ఆయన్ను జబర్దస్త్ లోకి రికమెండ్ చేసారు అనుకునేరు. అలాంటిదేమి లేదు. మరి హైపర్ ఆది  జబర్దస్త్ ఎంట్రీకి పవన్ కళ్యాణ్ కు లింక్ ఏంటంటారా..అది హైపర్ ఆదినే రివీల్ చేసాడు. 
 
‘‘ ఓసారి పవన్ కళ్యాణ్ నటించిన  ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌ను సరాదాగా  స్ఫూఫ్‌ చేసి వీడియో చేశాం. అది యూట్యూబ్‌లో పెడితే వేలమంది చూశారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తే ‘అదిరే అభి’ అన్న చూసి ‘బాగా చేశావ్‌ బ్రదర్‌. ఒకసారి కనిపించు’ అన్నాడు. అలా ‘జబర్దస్త్‌’లోకి వచ్చాను.  అక్కడికి వెళ్లిన వెంటనే ‘జబర్దస్త్‌’ టీమ్‌ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. అప్పటివరకూ రెండుమూడు లైక్‌లు వచ్చే నాకు నాకు వందల్లో వచ్చాయి. ఫొటోలు పెడితేనే ఇలా ఉందంటే.. మనం వాళ్లతో పాటు పక్క ఉంటే ఇంకా ఎలా ఉంటుందోనని వెళ్లా.’’ అంటూ తాను ‘జబర్దస్త్‌’లోకి వచ్చిన నేపథ్యాన్ని  చెప్పుకొచ్చారు.
 
అంటే ఓ రకంగా పవన్ … హైపర్ ఆదిని జబర్దస్త్ లోకి తీసుకువెళ్లినట్లే కదా. తను ఎవరినైతే అభిమానిస్తాడో అదే పవన్ కళ్యాణ్ సినిమా స్ఫూఫ్ తోనే ఆది ఈ స్దాయికి రాగలిగారు. అంతేకదా ఎవరికైనా ఏదైనా ఒక స్పూర్తి కావాలి. ఆ అభిమానమే జీవితంలోనూ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లటానికి ఉపకరిస్తుంది.