విడుద‌ల‌కు ముందే స‌మ‌స్య‌ల్లో `నోటా`

                                                           (ధ్యాన్)

తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నాలుగో సినిమాగా `నోటా` విడుద‌ల కానుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు.. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌రయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా త‌మిళం కూడా నేర్చుకుని స్వంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్ప‌కుంటున్నాడు. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలో ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `నోటా` తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 

ఈ సినిమాకు ఇప్పుడు రెండు స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ్డాయి. అందులో మొద‌టిది టైటిల్ గురించి.. నోటా అంటే `న‌న్ ఆఫ్ ది అబోవ్‌`.. ఎల‌క్ష‌న్‌లో పాల్గొనే అభ్య‌ర్థుల్లో ఎవ‌రూ న‌చ్చ‌క‌పోతే ఎన్నిక‌ల సంఘం పెట్టిన ఆప్ష‌న్ నోటా. దీనిపై ప్రెస్ చేస్తే ఓటు దుర్వినియోగం కాదు.. దొంగ ఓటు ప‌డే అవ‌కాశంలేదు.. ప్ర‌భుత్వంపై.. పాల‌కుల‌పై త‌మ వ్య‌తిరేక‌త‌ను నేరుగా తెలియ‌జేసే హ‌క్కు ప్ర‌జ‌లకు క‌ల్పించిన హ‌క్కు. అయితే ఇలాంటి ప‌దాన్ని టైటిల్‌గా పెట్ట‌డం ఏంటి? అంటే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని చెబుతున్నారా ఏంటి? అంటూ కొంత మంది నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్క‌డ లేని పోని స‌మ‌స్య‌ను తెచ్చిపెడుతుందోన‌ని నిర్మాత‌లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఇది టీమ్‌లోని వ్య‌క్తి నుండే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా? ర‌చ‌యిత శ‌శాంక్ వెన్నెల‌కంటి. త‌మిళం నుండి తెలుగుకి రైట‌ర్‌గా సూర్, జ్ఞాన‌వేల్ రాజా సినిమాల‌కు ప‌నిచేసే శశాంక్‌ను ఈ సినిమాకు ప‌క్క‌న పెట్టారు. దీంతో శ‌శాంక్ ఒప్పందాన్ని కాద‌ని.. త‌న‌ను ప‌క్క‌న పెట్టారంటూ శశాంక్ చెన్నై పోలీస్ క‌మీష‌న‌ర్‌కు పిర్యాదు చేశార‌ట‌. మ‌రి దీనిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో ఏమో ప్ర‌స్తుతానికి తెలియ‌డం లేదు కానీ.. సినిమా విడుద‌ల మాత్రం అక్టోబ‌ర్ మొద‌టివారంలోనే కావ‌డంతో నిర్మాత‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది.