చిన్న సినిమాకు చిరు స‌పోర్ట్‌ … 

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

                                                               (ధ్యాన్)

చిరు ఓ చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు విచ్చేస్తున్నాడు. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు `గీత గోవిందం`.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించారు. ప‌రుశురాం ద‌ర్శ‌కుడు. గీతా ఆర్ట్స్‌లో భాగ‌మైన జీఏ2 బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఆడియో విడుద‌లైంది. ఈ నెల 12న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేయ‌బోతున్నారు. ఈ ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు అల్లు అర‌వింద్ ఆహ్వానం మేర‌కు చిరంజీవి ఈ ఫంక్ష‌న్‌కి గెస్ట్‌గా వ‌స్తున్నాడ‌ట‌.