ట్రైలర్ లోనే ఈ రేంజి హాట్ గా,బోల్డ్ అంటే..ఇంక

                                                       (సూర్యం)

సినిమాకు అంటే సెన్సార్ ఉంది. టీవికు అంటే సంసారపక్షంగా ఉండాలనే రూల్ ఉంది. కానీ వెబ్ ప్రపంచానికి ఆ రూల్స్ ఏమీ లేవు. విచ్చలివిడిగా ఎవరికి తోచింది వారు షూట్ చేసి నెట్లో పెట్టేయచ్చు. కాకపోతే ఆ వీడియోలు ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాతిపదికన పెట్టాలి అన్న విచక్షణ ఉంటే చాలు. వెబ్ సీరిస్ లు వచ్చాక ఆ లైన్ కూడా చెరిగిపోయింది. హాట్,బోల్డ్ అనేది అక్కడ కామన్ అయ్యిపోయింది. ఓ మాదిరిగా ఉంటే వెబ్ ప్రేక్షకులకు కిక్ ఇవ్వటం లేదని కాస్తంత ఘాటుగానే మసాలా తగిలిస్తున్నారు. ఇదిగో ఇప్పుడీ ఈ క్రింద ట్రైలర్ చూడండి నిజమే అని మీరే ఒప్పుకుంటారు.

ఈ వెబ్ సీరిస్ లో కనిపించే అమ్మాయి రూపా గంగూలి.  ఆమె ఆ మధ్యన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంగవీటి’ సినిమాలో నటించింది.  కానీ వంగవీటి రత్నకుమారి పాత్ర కావటంతో చాలా డిగ్నిఫైడ్ గా తెరపై కనిపించింది. దాంతో.. . ‘వంగవీటి’ సినిమాకు  నైనకు ఏమాత్రం ఉపయోగపడలేదు.

దాంతో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సెక్సీ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉండే ఆమె వెబ్ సీరిస్ లో రెచ్చిపోయింది. అసలు అలా ఆమె నటిస్తుందని ఆమె అభిమానులు ఏ మాత్రం ఊహించలేదు.  ఇక ట్రైలరే ఈ రేంజిలో ఉంటే ..అసలు సినిమా అదే వెబ్ సీరిస్ ఏ రేంజిలో ఉంటుందో మీరే ఊహించుకోండి మరి.